Hyderabad, మార్చి 29 -- Mad Square Day 1 Box Office Collection: బ్లాక్ బస్టర్ చిత్రం 'మ్యాడ్'కి సీక్వెల్‌గా రూపొందిన సినిమా 'మ్యాడ్ స్క్వేర్'. ఎన్నో అంచనాలతో మార్చి 28న థియేటర్లలో గ్రాండ్‌గా మ్యాడ్ స్క్వేర్ మూవీ రిలీజ్ అయింది. మరి ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద రెస్పాన్స్, తొలి రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

శుక్రవారం విడుదలైన మ్యాడ్ స్క్వేర్ సినిమాకు తొలి రోజు ఇండియాలో రూ. 7.75 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు అయినట్లు ప్రముఖ ట్రేడ్ సంస్థ సక్నిల్క్ తెలిపింది. అదే నితిన్, శ్రీలీల జంటగా నటించి డేవిడ్ వార్నర్ కీలక పాత్రలో నటించిన రాబిన్‌హుడ్ మూవీకి తొలి రోజు భారతదేశంలో కేవలం రూ. 2 కోట్ల నెట్ కలెక్షన్స్ రానున్నట్లు సక్నిల్క్ అంచనా వేసింది.

ఈ లెక్కన చూస్తే రాబిన్‌హుడ్ కంటే మ్యాడ్ స్క్వేర్ మూవీకే తొలి రోజు కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి...