భారతదేశం, ఫిబ్రవరి 8 -- టెన్నిస్ లో సెన్సేషనల్ ప్రదర్శనతో మాయా రాజేశ్వరన్ దూసుకెళ్తోంది. సింగిల్స్ లో సూపర్ ఫామ్ తో భారత టాప్ సింగిల్స్ ప్లేయర్ గా ఎదిగేలా కనిపిస్తోంది. 15 ఏళ్లకే వయసుకు మించిన ఆటతీరుతో అదరగొడుతోంది. నిలకడగా రాణిస్తోంది. డబ్ల్యూటీఏ పాయింట్ ఖాతాలో వేసుకుంది.

ఎల్ అండ్ టీ ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ 125 సిరీస్‌లో యువ టెన్నిస్ ప్లేయర్ మాయా అసాధారణ ప్రదర్శనతో సెమీస్ లో చోటు దక్కించుకుంది. ఈ క్రమంలో ఇటలీకి చెందిన 264వ ప్రపంచ ర్యాంకర్ నికోల్ ఫోస్సా హ్యూర్గోపై 6-3, 3-6, 6-0తో గెలిచింది. ఆ తర్వాత ప్రపంచ 434వ ర్యాంకర్ జెస్సికా ఫైలా (అమెరికా)ను 7-6(9), 1-6, 6-4 తో చిత్తుచేసింది. ఈ అద్భుత విజయాలతో డబ్ల్యూటీఏ పాయింట్ సాధించిన యంగెస్ట్ ఇండియన్ ప్లేయర్ గా నిలిచింది.

ఈ డబ్ల్యూటీఏ 125 ఈవెంట్‌లో వైల్డ్ కార్డుతో ఎంట్రీ అయిన మాయా సూపర్ పర్ ఫార్మ...