భారతదేశం, ఏప్రిల్ 4 -- సింగ‌ర్ ఎస్‌పీ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన లైఫ్‌( ల‌వ్ యువ‌ర్ ఫాద‌ర్‌) ఏప్రిల్ 4న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. శ్రీహ‌ర్ష‌, క‌నికా క‌పూర్ హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ మూవీకి ప‌వ‌న్ కేత‌రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మ‌ణిశ‌ర్మ మ్యూజిక్ అందించాడు. మైథ‌లాజిక‌ల్ ఫాంట‌సీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ ఎలా ఉందంటే?

సిద్ధూ (శ్రీహర్ష) బీటెక్ కుర్రాడు. స్నేహితులతో కలిసి సర‌దాగా లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటాడు. సిద్ధు తండ్రి కిషోర్ (ఎస్పీ చరణ్) అనాథ‌ల‌కు అంతిమ సంస్కారాల‌ను నిర్వ‌హిస్తుంటాడు. పుట్టుక త‌ర్వాత మ‌నిషి జీవితంలో చావు కీల‌క‌మైన‌ద‌ని, దానికి గౌర‌వం ఇవ్వాల‌న్న‌ది కిషోర్‌ సిద్ధాంతం. కొడుకు సిద్ధు ఏ తప్పు చేసినా ప‌ల్లెత్తు మాట కూడా అన‌డు కిషోర్‌. స్వీటీ (కషిక కపూర్) ని ప్రేమిస్తాడు సిద్ధు. కొడుకు ప్రేమ‌కు కిషోర్ కూడా గ్రీన్‌...