భారతదేశం, మార్చి 29 -- Lyf Movie: దివంగత లెజెండరీ సింగర్ ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు సింగర్ ఎస్‌పీ చరణ్ న‌టుడిగా 'లైఫ్' (లవ్ యువర్ ఫాదర్) అనే సినిమాతో లాంగ్ గ్యాప్ త‌ర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోన్నాడు. ప‌వ‌న్ కేతరాజు దర్శకత్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో శ్రీహర్ష, కషిక కపూర్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్నారు. లైఫ్ మూవీకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందించారు.ఇటీవ‌ల లైఫ్‌ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. ఈ వేడుక‌కు ఎమ్మెల్యే మల్లా రెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.

ఈ వేడుక‌లో ఎమ్మెల్యే మల్లా రెడ్డి గారు మాట్లాడుతూ.. శ్రీ హర్ష తమిళ హీరో విజయ్ కంటే స్మార్ట్ గా ఉన్నాడు.. హీరోయిన్ కషిక కపూర్ కసి కసిగా బాగుంది. శ్రీ హర్ష మా కాలేజీ స్టూడెంట్‌. అత‌డి తండ్రి మా కాలేజీ ప్రిన్సిపాల్‌గా ప‌నిచేశాడు. వీరిద్ద‌రికి లైఫ్ మూవీలో పెద్ద విజ‌యం ద‌క్క...