Hyderabad, ఫిబ్రవరి 28 -- స్కూల్ అయినా, ఆఫీస్ అయినా, చాలా మంది ప్లాస్టిక్, టప్పర్ వేర్ లంచ్ బాక్స్‌లను ఉపయోగిస్తున్నారు. రంగురంగుల ఈ కంటైనర్లు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. అలాగే వీటిలో కూరలో వేసుకుని వెళ్లడం వల్ల నూనె కారిపోతుంది, బాక్సులు పగిలిపోతాయి అని భయపడుతూ ఉండాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ అసలు సమస్య ఏంటంటే.. కొత్త లంచ్ బాక్స్ కొన్ని రోజులు బాగుంటుంది, కానీ కొంతకాలం ఉపయోగించిన తర్వాత వాటిపై పచ్చల్లు, కూరగాయల పసుపు మచ్చలు, ఏర్పడతాయి. ఎంత శుభ్రంగా తోమినా జిడ్డు తొలగిపోదు. దీని వల్ల లంచ్ బాక్స్‌లో ఒక విచిత్రమైన వాసన కూడా వస్తుంది.

డిష్ వాషర్‌తో, స్క్రబ్‌తో ఎంత రుద్దినా ఈ మచ్చలు పోవు పైగా ఎక్కువగా రుద్దడం వల్ల లంచ్ బాక్స్‌లో గీతలు పడి చూడటానికి పాతదిగా కనిపిస్తుంది. మీకు ఇంట్లో కూడా ఇదే సమస్య ఉంటే, ఈరోజు మేము మీ కోసం కొన్ని సులభమైన క...