Hyderabad, ఫిబ్రవరి 26 -- Lucky Baskhar Netflix: లక్కీ భాస్కర్ మూవీ దూకుడు థియేటర్లలోనే కాదు నెట్‌ఫ్లిక్స్ లోనూ మామూలుగా లేదు. గతేడాది అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లకుపైగా వసూలు చేసింది. ఆ తర్వాత ఓటీటీలోనూ రికార్డులు క్రియేట్ చేస్తూ.. తాజాగా వరుసగా 13 వారాలుగా ట్రెండ్ అవుతున్న తొలి సౌత్ ఇండియన్ మూవీగా నిలిచింది.

దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి నటించిన మూవీ లక్కీ భాస్కర్. ఈ సినిమా గతేడాది అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజ్ కాగా.. నెల రోజుల్లోపే అంటే నవంబర్ 28 నుంచి నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చింది. అప్పటి నుంచీ ఓటీటీలో మూవీ దూకుడు మొదలైంది.

తొలి వారం నుంచే నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 ట్రెండింగ్ మూవీస్ లోకి వచ్చిన ఈ సినిమా ఇప్పటికే కొనసాగుతూనే ఉంది. ఇలా 13 వారాలుగా టాప్ 10లో ఉన్న తొలి సౌత్ ఇండియా...