భారతదేశం, ఏప్రిల్ 1 -- LRS Telangana : అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ తెలంగాణ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ అమలు చేస్తుంది. మార్చి 31 వరకు ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన వారి 25 శాతం రాయితీ కూడా కల్పించింది. ఎల్ఆర్ఎస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.వెయ్యి కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ఈ మేరకు ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల వివరాలను అధికారులు ప్రకటించారు.

ఇదిలా ఉంటే లేఅవుట్ల క్రమబద్దీకరణ (ఎల్ఆర్ఎస్) గడువు మార్చి 31తో ముగిసింది. దీంతో వన్ టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని ఏప్రిల్ నెలాఖరు వరకు పొడిగించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈసారి గడువు పెంచినప్పటికీ ఫీజులో రాయితీ 25 శాతం కాకుండా తగ్గించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎల్ఆర్ఎస్ స్కీమ్ 2020లో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. గత ఉత్తర్వుల ఆధారంగా దరఖాస్తుదారులకు 25 శాతం రాయితీతో ఫీజు చెల్లించేందుకు ఈ పథకాన్...