భారతదేశం, ఏప్రిల్ 2 -- LRS Telangana : అక్రమ లేఅవుట్ల క్రమబద్దీకరణకు తెలంగాణ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ స్కీ్మ్ అమల చేస్తున్న విషయం తెలిసిందే. మార్చి 31తో ఎల్ఆర్ఎస్ గడువు ముగియగా....మరోసారి ఈ గడువు పొడిగించారు. ఏప్రిల్ 30 వరకు ఎల్ఆర్ఎస్ గడువు పెంచినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రజల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని పురపాలక శాఖ గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనితో పాటు ఏప్రిల్ 30 లోగా ఫీజు చెల్లించిన వారికి 25 శాతం రాయితీ కల్పించనున్నట్లు అధికారులు చెప్పారు.

లే అవుట్ల రెగ్యులరేషన్ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సుమారుగా రూ.వెయ్యి కోట్ల పైగా ఆదాయం సమకూరింది. ఈ పథకం ద్వారా అనధికార లే అవుట్లను క్రమబద్ధీకరించనున్నారు. ఇప్పటివరకు మున్సిపాలిటీల పరిధిలో ఎల్‌ఆర్‌ఎస్‌కు 15.27 లక్షల దరఖాస్తులు రాగా , వీటిలో 15,894 దరఖాస్తులు రిజక్ట్ అయ్యాయి. మిగిలిన...