భారతదేశం, మార్చి 4 -- LRS Telangana : అనుమతి లేని లేఅవుట్ల క్రమబద్ధీకరణ(LRS) అప్లికేషన్లను పరిష్కరించేందుకు హెచ్ఎండీఏ ప్రత్యేక చర్యలు చేపట్టింది. జోనల్‌ కార్యాలయాల్లో దరఖాస్తుదారుల కోసం సహాయ కేంద్రాలను ఏర్పాటుచేసింది. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులపై సందేహాల నివృత్తి చేసేందుకు హెచ్‌ఎండీఏ వద్ద కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. ఎల్ఆర్ఎస్ పై సందేహాలుంటే టోల్ ఫ్రీ నెంబర్ 1800 599 8838కి కాల్‌ చేయవచ్చని సూచించారు. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ లో అర్హత ఉన్న దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించారు. మార్చి 31లోపు క్రమబద్ధీకరణ రుసుము చెల్లించే వారికి 25శాతం రాయితీ ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇప్పటికే ప్రకటించారు.

ప్లాట్ యజమానుల సౌకర్యం కోసం LRS 2020 వెబ్‌సైట్‌ https://lrs.telangana.gov.in/ ను ప్రారంభించారు. లాగిన్ అవ్వాల్సిన అవసరం...