Hyderabad, ఫిబ్రవరి 25 -- విదేశీ ప్రయాణాలు చేయాలని ఎంతోమందికి ఉంటుంది. కానీ అవి ఖర్చుతో కూడుకున్నవని ఎంతో మంది వెనకడుగు వేస్తారు. కొన్ని రకాల దేశాలకు వెళ్లాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది, కానీ కొన్ని తక్కువ ఖర్చుతో వెళ్లే దేశాలు కూడా ఉన్నాయి. ఇవి చాలా అందంగా ఉంటాయి. పైగా వీటికి వీసా కూడా అవసరం లేదు. మీ దగ్గర 50 వేల రూపాయలు ఉంటే చాలు... ఉచిత ప్రవేశ వీసా ఇస్తున్న దేశాలు ఇక్కడ ఉన్నాయి. ఈ అందమైన దేశాలను సందర్శించేందుకు ప్రయత్నించండి. అది కూడా అది తక్కువ ఖర్చులో.

భారతదేశానికి అతి దగ్గరగా ఉన్న దేశం భూటాన్. మీ దగ్గర 50వేల రూపాయలు ఉంటే చాలు... ఈ దేశాన్ని సులువుగా సందర్శించవచ్చు. ఎందుకంటే అది మన దేశానికి దగ్గరగానే ఉంటుంది. అక్కడ అన్నీ చవకగానే ఉంటాయి. పైగా ఆ దేశానికి వెళ్లే భారతీయులకు 15 రోజులు పాటు వీసా కూడా అవసరం లేదు. 15 రోజుల్లో మీరు పర్యటన ముగించ...