భారతదేశం, ఫిబ్రవరి 9 -- చాలా మంది ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. కానీ అందరికీ అదే సాధ్యం కాదు. ప్రేమలో సక్సెస్ అయ్యే వారు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. మీరు కూడా ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్నారా? కానీ ఏదో ఒక సమస్య వస్తోందా? అయితే మీ ప్రేమ సక్సెస్ అవ్వడానికి ఈ జ్యోతిష్య పరిహారాలను పాటించండి. దీంతో మీ ప్రేమ మరింత దృఢంగా మారుతుంది. మీ కుటుంబ సభ్యులు మీ ప్రేమను అంగీకరిస్తారు. ప్రేమలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి.

ప్రేమ వివాహం అవ్వాలంటే శివ-పార్వతులను, లక్ష్మీ-విష్ణువులను, శ్రీకృష్ణుడును పూజించండి. దీంతో వారి అనుగ్రహం కలిగి ప్రేమ వివాహం జరుగుతుంది. పెద్దలు కూడా మీ ప్రేమను ఒప్పుకుంటారు. అలాగే పూజ చేసేటప్పుడు గులాబీ పూలను, నెయ్యి దీపాలను కచ్చితంగా సమర్పించేటట్లు చూసుకోండి. అలాగే ఉపవాసం ఉండడం, దానాలు చేయడం వంటివి పాటించినట్...