భారతదేశం, ఏప్రిల్ 8 -- Love Marriage : ఇన్నాళ్లు అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు....ప్రేమ పెళ్లి (Love Marriage)చేసుకుని వెళ్లిపోయిందని ఓ తండ్రి తీవ్ర ఆవేదన చెందారు. తన బిడ్డను ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నారని కన్నీళ్లు పెట్టుకున్నారు. కూతురు ప్రేమ పెళ్లి చేసుకున్న వెళ్లిపోయిందని, ఆమెకు శ్రద్ధాంజలి పోస్టర్ పెట్టాడు తండ్రి. సిరిసిల్లకు చెందిన చిలువేరి మురళి కుమార్తె 18 ఏళ్ల చిలువేరి అనూష తన తండ్రికి తెలియకుండా ఇటీవల ప్రేమ పెళ్లి చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె తండ్రి మురళి ఇక తన కూతురు చనిపోయిందని శ్రద్ధాంజలి పోస్టర్‌ను పెట్టారు. తన కూతురు ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడని ఆరోపించారు. మనస్థాపంతో ఆ తండ్రి చేసిన పని నెట్టింట వైరల్ అవుతోంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి, మంచి కాలేజీలో చదువు చెప్పిస్తే... తన కూతురు తనను మోసం చేసిందని ముర...