Hyderabad, ఫిబ్రవరి 28 -- ఒకే ఆఫీసులో పనిచేసే ప్రేమికులు వృత్తిపరంగా ఎలాంటీ సమస్యలు రాకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఇద్దరికీ నష్టం తప్పదు. వృత్తిపరమైన జీవితానికీ, వ్యక్తిగత జీవితానికీ మధ్య సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. వారిద్దరూ ఆఫీసులో హుందాగా ప్రవర్తించకపోతే వారి కెరీర్ పైనే పెద్ద దెబ్బ పడుతుంది. ప్రేమ సంబంధాన్ని కాపాడుకోవడం ముఖ్యమే. కానీ కెరీర్ ను కూడా కాపాడుకోవాలి. కెరీర్ ఉంటేనే ఆ ఇద్దరూ సంతోషంగా ముందుకు సాగగలుగుతారు. కాబట్టి ఒకే ఆఫీసులో పనిచేస్తున్న ప్రేమికులు ఎలా ప్రవర్తించకూడదో తెలుసుకోండి. అలాగే ఎలా ప్రవర్తించాలో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

ఆఫీసు అనేది ఒక వృత్తిపరమైన ప్రదేశం ఇక్కడ పనికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. ఆఫీసులో అడుగుపెట్టిన తర్వాత వ్యక్తిగత విషయాలు మాట్లాడుకోవడం, ప్రేమ విషయాలు చర్చించడం వంటి...