భారతదేశం, ఏప్రిల్ 24 -- చైనాలో ఓ మహిళకు 'లవ్ బ్రెయిన్'(love brain) అనే మానసిక వ్యాధి ఉన్నట్లు తేలింది. తన బాయ్ ఫ్రెండ్ కు ఆమె ఒక రోజులో 100 సార్లకు పైగా ఫోన్ చేసిందని, అతడు ఎక్కడ ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? అని పదేపదే ప్రశ్నించేదని, అతడెప్పుడూ తన పక్కనే ఉండాలని కోరుకునేదని ఆమెకు చికిత్స అందించిన వైద్యులు తెలిపారు.

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (SCMP) కథనం ప్రకారం, జియావోయు అనే మహిళకు బోర్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ మానసిక వ్యాధిని వ్యావహారికంగా "లవ్ బ్రెయిన్ (love brain)" అని పిలుస్తారు. ఈ పరిస్థితి యాంక్జైటీ, డిప్రెషన్, బైపోలార్ డిజార్డర్ వంటి ఇతర మానసిక అనారోగ్యాలతో కలిసి ఉండవచ్చని చెంగ్ డూ లోని ఫోర్త్ పీపుల్స్ హాస్పిటల్ వైద్యుడు మరియు జియావోయుకు చికిత్స చేసిన డాక్టర్ డు నా చెప్పారు.

పై చదువుల కోసం యూనివర్సిటీ...