భారతదేశం, డిసెంబర్ 7 -- ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని అనుకుంటారు. అందుకే పర్వదినాలప్పుడు కొన్ని రకాల పరిహారాలను పాటిస్తూ ఉంటారు. అయితే వచ్చిన వాటిని సరిగ్గా వినియోగించుకుంటే చక్కటి ఫలితాన్ని పొందవచ్చు. కొన్ని పరిహారాలు అద్భుతంగా పని చేస్తాయి, జీవితాన్ని కూడా మార్చేస్తాయి. ఈరోజు చాలా శక్తివంతమైన రోజు. మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం చాలా శక్తివంతమైనది. ఇది మహాశివరాత్రితో సమానం. ఇది ఎందుకు అంత విశేషమైనదంటే, బ్రహ్మా-విష్ణు మధ్య సంగ్రామం జరిగినప్పుడు శివుడు ఈరోజు అగ్నిస్తంభంగా ఆవిర్భావం అయిన రోజు.

శివుడికి ఈరోజు అభిషేకం చేయడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు. తెలిసీ తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. కర్మల నుంచి విముక్తి కలుగుతుంది. ఈరోజు ప్రాతఃకాలంలో అంటే ఉదయం 4:30 నుంచి 6 గంటల లోగా శివుడికి అభిషేకం చేయాలి. ఆవు పాలతో చేసిన నైవేద్యాన్ని శ...