భారతదేశం, డిసెంబర్ 11 -- శని దేవుడిని న్యాయానికి అధిపతి అంటారు. శని మనం చేసే కర్మలను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడు. మంచే చేస్తే మంచి ఫలితాలు, చెడు చేస్తే చెడ్డ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. జాతకంలో శని స్థానం బలంగా ఉంటే ఆనందంగా ఉండొచ్చు, ధనవంతులు అవ్వచ్చు. అదే ఒకవేళ శని దేవుని దృష్టి ప్రతికూలంగా ఉన్నట్లయితే, ఏ ప్రయత్నం చేసినా కూడా ఎంత కష్టపడినా సరే ఏ మాత్రం ఫలితం రాదు. రకరకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఉద్యోగ పరంగా సమస్యలు రావచ్చు, వ్యాపారంలో నష్టాలు, ఆర్థికపరంగా ఇబ్బందులు ఇలాంటివన్నీ కలుగుతాయి. చాలా మంది శని దోషాలతో బాధపడుతూ ఉంటారు. అలాగే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని వంటి వాటితో బాధ పడుతూ ఉంటారు. అలాంటి వారు శని దేవుని ఆలయానికి వెళ్లి ఆవాల నూనె, నల్ల నువ్వులను సమర్పిస్తే శని దోష ప్రభావం నుంచి బయటపడొచ్చు. శని దోషాల నుంచి ...