Hyderabad, మార్చి 15 -- నల్లటి, పొడవైన జుట్టు చాలా మంది అమ్మాయిలు తపిస్తుంటారు. మహిళల అందాన్ని పెంచడంలో పొడవైన జుట్టు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందుకోసం మార్కెట్లో దొరికే రకరకాల నూనెలు, షాంపూల కోసం వేలకు వేలు ఖర్చు చేస్తుంటారు. వీటిన్నింటి కారణంగా జుట్టు పొడవుగా నల్లగా మారడం అటుంచి తెల్ల వెంట్రుకలు, జుట్టు రాలే సమస్య తలెత్తుతుంది. వెంట్రుకలు చిట్లిపోయి ఎదుగుదల కూడా ఆగిపోతుంది. ఇందుకు కారణం మార్కెట్లో దొరికే ఉత్పత్తుల తయారీకి హానికరమైన రసాయనాలను ఉపయోగించడం. మరి పొడవాటి జుట్టు కోసం ఏం చేయాలి? తెల్ల వెంట్రుకల సమస్య నుంచి ఎలా తప్పించుకోవాలంటే ఎలాంటి పదార్థాలను ఉపయోగిచాలి? అనుకుంటున్నారా.? అయితే ఈ వార్త పూర్తిగా చదవండి.

జుట్టు అందంగా, ఆరోగ్యంగా అంటే ఒత్తుగా, పొడవుగా నల్లగా మారాలంటే ఎప్పుడూ సహజమైన ఉత్పత్తులను ఎంచుకోవడం అలవాటు చేసుకోండి. సమయం లేద...