భారతదేశం, జనవరి 30 -- London BRS: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 420 రోజులు అయ్యినా 2023 ఎన్నికలలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చక పోవడం కాంగ్రెస్ పార్టీ కి తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ధికి నిదర్శనం అని అన్నారు. 420 రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందనీ, అంతే కాకుండా ప్రశ్నించిన ప్రతి పక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ, రాష్ట్రంలో ఒక అరాచక పాలన కొనసాగించడం, అక్రమ అరెస్టులు, నిర్బంధాలు ఇలా రాష్ట్రాన్ని మళ్ళీ ఇరవై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారన్నారు.

కేటీఆర్‌ పిలుపు మేరకు ఎన్నారై బీ.ఆర్.యస్ యూకే ఉపాధ్యక్షుడు రవి కుమార్ రేతినేని యూకే పార్లమెంట్ ముందు ర్ తెలంగాణ రాష్ట్రంలో హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేసిందని నిరసన తెలిపారు. ఇప్పటికైనా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కళ్ళు తెరిచి ప్రజలకు ఇచ్చ...