భారతదేశం, ఫిబ్రవరి 18 -- వల్లభనేని వంశీ అరెస్టుపై మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా వంశీని జగన్ జైలులో పరామర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా దిగజారిపోయాయని ఆరోపించారు. వల్లభనేని వంశీ అరెస్టు అందుకు ప్రత్యక్ష నిదర్శనం అని స్పష్టం చేశారు. ఇంకా ప్రభుత్వం సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కామెంట్స్‌పై మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు.

'నిజం చెబితే తల వెయ్యి ముక్కలు అవుతుందనే శాపం మీకేమైనా ఉందా జగన్ రెడ్డి గారు?. పచ్చి అబద్దాలను కాన్ఫిడెంట్‌గా చెప్పడంలో మీరు పీహెచ్‌డీ చేసినట్టు ఉన్నారు. మీరు ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు అనే భ్రమలోంచి ఇకనైనా బయటకు రండి. 100 మందికి పైగా వైసీపీ రౌడీలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడి చేయడం కోట్లాది ప్రజలు కళ్లారా చూసారు. కక్ష సాధింపు, కుట్రలు, కుతంత్రాలు మీ బ్రాండ్ జగన్ రెడ్డి. అధికారం ఉన్నప్పుడు యథేచ...