భారతదేశం, ఫిబ్రవరి 6 -- Lokesh In Delhi: మంత్రి నారా లోకేష్‌, ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కీలకమైన నాయకుడు.. టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఏకైక తనయుడు. యువగళం పాదయాత్రతో టీడీపీలో కొత్త ఉత్సాహాన్ని తెచ్చిన నాయకుడు.. ప్రస్తుతం ఏపీ క్యాబినెట్‌లో మంత్రి పదవిలో ఉన్నారు.

ఏపీ రాజకీయాల్లో నారా లోకేష్‌ కీలకమైన స్థానంలో ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తర్వాత కీలకమైన స్థాయిలో లోకేష్ ఉన్నారు. గత రెండు రోజులుగా నారా లోకేష్‌ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పర్యటనలపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది. రాజకీయంగా లోకేష్‌ స్థానాన్ని సుస్థిరంగా చేసుకునే దిశగా అడుగులు పడుతున్నాయనే ప్రచారం జరుగుతోంది.

ఢిల్లీ పర్యటనలో లోకేష్‌ కేంద్ర మంత్రులు, బీజేపీలో ముఖ్యమైన నాయకులతో భేటీ అవుతున్నారు. సాధారణంగా క్యాబినెట్ మంత్రులు ఎవరైనా ఢిల్లీకి వెళ...