భారతదేశం, ఫిబ్రవరి 24 -- Localboy Nani Arrest: సోషల్‌ మీడియా వేదికలపై సులువుగా డబ్బు సంపదించవచ్చు అంటూ ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న విశాఖపట్నం యూ ట్యూబర్‌ వాసుపల్లి నాని అలియాస్ లోకల్ బాయ్ నానిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.

విశాఖపట్నంలోని కంచరవీధికి చెందిన లోకల్‌ బాయ్‌ నాని యూట్యూబర్‌గా గుర్తింపు పొందాడు. సముద్రంలో చేపల వేటతో పాపులర్ అయ్యాడు. ఇటీవల బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తూ ఒక వీడియోను రూపొందించారు. యువతను తప్పుదోవ పట్టిస్తున్న నాని తీరుపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ, ఐపీఎస్‌ అధికారిసజ్జనార్‌ తప్పు పట్టారు. గతంలో బయ్యా సన్నీ యాదవ్‌ పేరున్న మరో యూ ట్యూబర్‌ తీరును కూడా సజ్జన్నార్‌ ఖండించారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ప్రచారం చేయడాన్ని సజ్జన్నార్ తప్పు పట్టారు. ఈ క్రమంలో వారిపై చర్యలు తీస...