భారతదేశం, మార్చి 12 -- Liquor Shops Close : హైదరాబాద్ లో మందుబాబులకు బ్యాడ్ న్యూస్. హోలీ పండుగ నేపథ్యంలో ఈ నెల 14వ తేదీ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు మూసివేయనున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో మద్యం, కల్లు దుకాణాలతో పాటు బార్ అండ్ రెస్టారెంట్లు మూసివేయాలని పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను ఉల్లఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

హైదరాబాద్ లో హోలీ పండుగను ఎంతో వైభవంగా జరుగుపుకుంటారు. చిన్న, పెద్ద అంతా వీధుల్లోకి వచ్చి రంగులు పూసుకుంటూ ఆనందంగా గడుపుతారు. వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టింది పోలీస్ శాఖ. ముఖ్యంగా మద్యం దుణాకాలను మూసివేయాలని ఆదేశించింది. హోలీ పండుగ సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, శాంతి భద్రతలకు...