భారతదేశం, ఫిబ్రవరి 22 -- Liquor Seized : మద్యం అక్రమ రవాణాపై కర్నూలు పోలీసులు నిఘాపెట్టారు. మంత్రాలయం మండలంలో ఏపీ-కర్ణాటక సరిహద్దులోని మాదవరం చెక్‌పోస్ట్ వద్ద సీఐ రాజేంద్ర ప్రసాద్, ఎస్ఐ తేజ, సిబ్బంది నేతృత్వంలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ నిఘా బృందం (ESTF) అనుమానాస్పద వాహనాన్ని అడ్డుకుంది. కర్ణాటకలో రిజిస్ట్రేషన్ అయిన సుమోకు నకిలీ ఏపీ నంబర్ ప్లేట్‌ను పెట్టారు. ఈ వాహనంలో 30 పెట్టెల పన్ను చెల్లించని కర్ణాటక మద్యం రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. మద్యం పెట్టెల్లో 90 ml పరిమాణంలో 2880 ఒరిజినల్ ఛాయిస్ విస్కీ టెట్రా ప్యాక్‌లు ఉన్నాయి.

నిందితులు ఎగిడ వెంకటేష్, తిమ్మయ్య (డ్రైవర్)లను అరెస్టు చేశారు. రవాణాకు ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. యెమ్మిగనూరులోని పీ&ఈఎస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ ఆపరేషన్ కర్నూలులోని ఏఈఎస్ రామకృష్ణ పర్యవేక్షణలో జర...