Hyderabad, ఫిబ్రవరి 2 -- సున్నం(Limestone) తినం చెడ్డ అలావాటేం కాదా? దీన్ని తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందా? ఇదెక్కడి గోళరా బాబు అని మీకు అనిపించవచ్చు. వినడానికి ఇది కాస్త వింతగానూ, ఆశ్చర్యంగానూ అనిపించవచ్చు. ఎందుకంటే సున్నం అంటే కేవలం పాన్‌లో వేసే పదార్థం గానే మీరు భావిస్తున్నారు కనుక. కానీ నిజానికి సున్నం తినడం వల్ల ఆరోగ్యానికి చాలా రకాల మేలు జరుగుతుందట. కాకపోతే ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. సరైన పద్ధతిలో తింటేనే ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. లేకపోతే ప్రయోజనాలకు బదులు నష్టం కలుగుతుంది.

నిజానికి సున్నం అనేది కాల్షియం, ఆక్సిజన్‌తో తయారైన రసాయనం. దీన్ని నీటిలో కలిపినప్పుడు, ఇది కాల్షియం హైడ్రాక్సైడ్‌గా మారుతుంది. దీన్ని వాడుక భాషలో లైమ్ వాటర్(Lime water) అంటారు. ఇప్పటి వరకూ పాన్, సుపారీతో పాటు పాన్ వ్యాపారుల దగ్గర దొరి...