భారతదేశం, ఏప్రిల్ 14 -- అయిదేళ్ల అయినా 'లైఫ్ ఆఫ్ రామ్' సాంగ్ క్రేజ్ మాత్రం అసలు తగ్గట్లేదు. కథానాయకుడి ఒంటరి ప్రయాణాన్ని వివరిస్తూ సాగే ఈ పాట ఫ్యాన్స్ మది దోచుకుంటూనే ఉంది. ఈ సాంగ్ లో హీరో పర్సనాలిటీకి చాలా మంది వ్యక్తిగతంగా కనెక్ట్ కావడమే ఇందుకు కారణం. 2020 ఫిబ్రవరిలో యూట్యూబ్ లో పోస్టు చేసిన ఈ వీడియో సాంగ్ కు ఇప్పటివరకూ 22 కోట్లకు పైగా వ్యూస్ రావడం విశేషం.

శర్వానంద్, సమంత జోడీగా నటించిన 'జాను' సినిమాలోని ఈ సాంగ్ దివంగత సిరివెన్నెల సీతారామ శాస్త్రి కలం నుంచి జాలువారిన ఓ మేలిమి ఆణిముత్యం. ఎన్నో అద్భుతమైన పాటలకు సాహిత్యాన్ని అందించి దివికేగిన సిరివెన్నెల.. ఈ లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్ తో మరో పెట్టు పైకేక్కేశారనే చెప్పొచ్చు. ఈ సాంగ్ లోని ఒక్కో పదానికి ఉండే అర్థం ప్రేక్షకుల మనసుల్లోకి చొచ్చుకెళ్లింది.

ఈ సాంగ్ కు అద్భుతమైన మ్యూజిక్ ను ఇచ్చారు గోవి...