భారతదేశం, మార్చి 3 -- LIC Smart Pension Plan : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఫిబ్రవరి 18, 2025న కొత్తగా స్మార్ట్ పెన్షన్ ప్లాన్ ప్రారంభించింది. పదవీ విరమణ చేసిన తర్వాత స్థిరమైన ఆదాయాన్ని అందించడానికి స్మార్ట్ పెన్షన్ ప్లాన్ ఉపయోగపడుతుంది. ఇది సింగిల్ ప్రీమియం స్కీమ్. అంటే ఒకేసారి ప్రీమియం చెల్లించాలి. కొంత కాలం తర్వాత నుంచి జీవితాంతం పెన్షన్ అందుతూనే ఉంటుంది. ఈ పథకం కింద సింగిల్, జాయింట్ యాన్యుటీ ఎంపికలు రెండింటినీ పాలసీదారులు ఎంచుకోవచ్చు. పాలసీ తీసుకున్న 3 నెలల తర్వాత మీరు రుణ సదుపాయం పొందవచ్చు.

స్మార్ట్ పెన్షన్ ప్లాన్ పాలసీదారులకు జీవితాంతం ఆర్థిక భద్రత, ఒత్తిడి లేని పదవీ విరమణ జీవితాన్ని అందించే పథకం. ఈ పథకం కింద పాలసీదారులు సింగిల్ ప్రీమియం చెల్లించి జీవితాంతం స్థిరమైన పెన్షన్‌ను పొందవచ్చు. పాలసీదారులు నెలవారీ, త్రైమా...