భారతదేశం, అక్టోబర్ 14 -- ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ షేర్లు స్టాక్ మార్కెట్‌లో మంగళవారం భారీ ప్రీమియంతో లిస్ట్ అయ్యాయి. ఈ సంస్థ షేరు ధర బీఎస్‌ఈలో ఇష్యూ ధర రూ. 1,140తో పోలిస్తే, ఏకంగా రూ. 575 అధికంగా (50.44% ప్రీమియం).. రూ. 1,715 వద్ద నమోదైంది. అదేవిధంగా ఎన్​ఎస్​ఈలో కూడా ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ షేరు ధర 50.01% ప్రీమియంతో రూ. 1,710.10 వద్ద తన ప్రయాణాన్ని ప్రారంభించింది.

ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ లిస్టింగ్.. అంచనాలను మించిపోయింది. దీనికి ముందే గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ) కూడా సానుకూల సంకేతాలు ఇచ్చింది. మార్కెట్‌లో లిస్ట్ కావడానికి ముందు, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ షేర్లు రూ. 1,562 వద్ద ట్రేడ్ అయ్యాయి, ఇది దాదాపు 37% లిస్టింగ్ ప్రీమియంను సూచించింది.

లిస్టింగ్ రోజుకు ముందే, దేశీయ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్...