భారతదేశం, నవంబర్ 3 -- కళ్లద్దాల డిజైన్​, తయారీ చేసే రిటైల్ సంస్థ లెన్స్‌కార్ట్​కి చెందిన ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) సబ్​స్క్రిప్షన్ ప్రారంభమైన మొదటిరోజే పూర్తిగా సబ్​స్క్రైబ్​ అయిపోయిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు సబ్​స్క్రిప్షన్​ రెండో రోజు, నవంబర్​ 3న, కూడా ఈ ఐపీఓకి భారీ స్పందన లభిస్తోంది! రూ. 7,278 కోట్ల విలువైన ఈ పబ్లిక్ ఇష్యూ రెండో రోజు ఇప్పటివరకు దాదాపు 1.5 రెట్లు (146 శాతం) మేర బుక్ అయింది.

నవంబర్ 3న ఉదయం 11.15 గంటలకు నేషనల్ స్టాక్ ఎక్స్​ఛేంజ్​ డేటా ప్రకారం.. కంపెనీ 9.98 కోట్ల షేర్ల ఆఫర్ సైజుకు గాను, 14.6 కోట్ల షేర్లకు పైగా బిడ్లు వచ్చాయి!

రిటైల్ ఇన్వెస్టర్లు ఈ లెన్స్​కార్ట్​ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ సంఖ్యలో ముందున్నారు. వీరు తమ కోసం రిజర్వ్ చేసిన వాటాను 2 రెట్లకు పైగా (224 శాతం) బుక్ చేసుకున్నారు.

క్వాలిఫైడ్ ఇన్​స్టిట్యూషనల్ బయ...