Hyderabad, మార్చి 16 -- వేసవి కాలం ప్రత్యేకంగా తాగే నిమ్మరసం ఏడాదంతా తాగినా ఒకే రకమైన ప్రయోజనాలు అందుతాయి. దీనిని పోషకాలు అందించే డ్రింక్ గానో లేదంటే డీటాక్సింగ్ చేసే జ్యూస్ గానో ట్రీట్ చేసి తాగుతుంటారు. రోజుకు ఒకసారి నిమ్మరసం తాగడం ఆరోగ్యానికి మంచిది. శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు తక్షణమే దాహాన్ని తీర్చి శరీరానికి సరిపడ పోషకాలను అందిస్తాయి. నిమ్మరసం తాగడం వల్ల కలిగే మరెన్నో ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

నిమ్మకాయలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసే ముఖ్య పోషకం. రోజూ నిమ్మరసం తాగడం వల్ల శరీరం అంటువ్యాధుల బారిన పడకుండా పోరాడేందుకు సహాయపడుతుంది. అప్పటికే జలుబు, జ్వరం బారిన పడితే ఆ సమస్య నుంచి తగ్గిస్తుంది. ఇది మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

నిమ్మరసం తా...