Hyderabad, ఫిబ్రవరి 3 -- నిమ్మకాయలు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. నిమ్మరసం నుంచి నిమ్మకాయ పులిహోర వరకూ, క్లీనింగ్ నుంచి స్కిన్ గ్లో వరకూ అన్నింటిలోనూ నిమ్మకాయ పాత్ర అమోఘమైనది. అలాంటి నిమ్మకాయను బయట నుంచే ప్రతిసారి కొనుక్కురావడం ఎందుకు? ఇంట్లోనే ఈజీగా పెంచుకుంటే బాగుంటుంది కదా అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అయితే ఈ టిప్స్ మీ కోసమే. వీటిని పాటించారంటే ఎక్కువ చోటు లేకపోయినా, నేల లేకపోయినా కుండీలో కూడా ఈజీగా నిమ్మకాయలను పెంచుకోవచ్చు. మీ బాల్కనీనే నిమ్మతోటగా మార్చేయచ్చు. ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందాం రండి..

నిమ్మకాయలను పెంచాలనే ఆసక్తి మీకు ఉంటే మీరు విత్తనాలను నాటాలనుకుంటున్నారా లేదా మొక్కను కొనుగోలు చేసి పెంచుకోవాలి అనుకుంటున్నారా అని ముందుగా నిర్ణయించుకోండి. విత్తనాల నాటి పెంచినప్పడు మొక్క పూర్తి అభివృద్ధిని మీరు చూడవచ్చు. అలాగే మొక్క...