భారతదేశం, ఫిబ్రవరి 7 -- ఎప్పుడూ తినగలిగేంత ఆహారం మాత్రమే వండాలని పెద్దలు చెబుతుంటారు. ఆయుర్వేదం, ఆధునిక శాస్త్రాలు కూడా ఎల్లప్పుడూ తాజాగా వండుకున్న ఆహారాలను మాత్రమే తినాలని చెబుతాయి. మిగిలిన పాత ఆహారాలను రిఫ్రిజిరేటర్లో ఉంచి లేదా మళ్ళీ వేడి చేసి తినడం వల్ల దాంట్లోని పోషక విలువలు తగ్గుతాయి, రుచి కూడా చెడిపోతుంది. పైగా వాటిలోకి బ్యాక్టీరియా ప్రవేశించి ఆరోగ్యానికి హాని కలిగే ప్రమాదముంది. అందుకే మిగిలిపోయిన ఆహారాలను తినకూడదు అంటారు. అయితే అన్ని రకాల ఆహార పదార్థాలకు ఇది వర్తించదట.

కొన్ని రకాల పదార్థాలు పాతబడిన తర్వాత మరింత రుచికరంగా మరతాయట. వాటిలోని పోషక విలువులు కూడా రెండింతలు అవుతాయట. ఆశ్చర్యకరంగా అనినిపించినప్పటికీ ఇది వాస్తవమే అంటున్నారు ఆహార నిపుణులు. కొన్ని రకాల ఆహార పదార్థాలు వండిన రోజు కన్నా మరుసటి రోజే రుచిగా ఉంటాయట. వీటిలోని పోషక వి...