భారతదేశం, మార్చి 18 -- Investment Word of the Day:ఒక ఇన్వెస్టర్ కు అత్యంత కీలకమైన విషయం ఏదైనా ఒక స్టాక్ లో ఇన్వెస్ట్ చేయాలా? వద్దా? అని నిర్ణయించుకోవడం. దీనిని నిర్ణయించడానికి, ఆ స్టాక్ ఓవర్ వాల్యుయేషన్ తో ఉందా? లేక అండర్ వాల్యూడ్ గా ఉందా? అని తెలుసుకోవడం చాలా అవసరం. స్టాక్ యొక్క విలువను అంచనా వేయడానికి సరళమైన, ఎక్కువగా ఉపయోగించే అంశం ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో. దీనినే P/E నిష్పత్తి అంటారు.

పి/ఇ నిష్పత్తి, లేదా ప్రైస్-టు-ఎర్నింగ్స్ నిష్పత్తిని.. కంపెనీ ప్రస్తుత షేరు ధరను ఆ కంపెనీ ఎర్నింగ్స్ పర్ షేర్ తో పోల్చడం ద్వారా లెక్కిస్తారు. పీఈ రేషియోను వివిధ రకాలుగా నిర్ధారిస్తారు. చాలా సందర్భాలలో, 12 నెలల కాల వ్యవధిని పరిగణనలోకి తీసుకుని పీఈ రేషియోను లెక్కిస్తారు.

ఒక షేరు యొక్క ప్రస్తుత మార్కెట్ ధరను ఆ కంపెనీ ఎర్నింగ్స్ పర్ షేర్ తో విభజించడం ద...