భారతదేశం, ఫిబ్రవరి 6 -- భవన నిర్మాణదారుల నిర్లక్ష్యం ముగ్గురు కూలీలను పొట్టనబెట్టుకుంది. మట్టి కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. హైదరాబాద్ ఎల్బీనగర్ కూడలి సమీపంలో జరిగిన విషాద ఘటనలో మరొకరు తీవ్రగాయలతో బటపడ్డారు. ఈ ఘటనపై జీహెచ్ఎంసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. భవన నిర్మాణ యజమానులకు నోటీసులు ఇచ్చింది. నిర్మాణ అనుమతులను రద్దు చేసింది.

ఎల్బీ నగర్ కూడలి సమీపంలో.. 1000 చదరపు గజాల స్థలంలో రమేష్, విజయ్ అనే ఇద్దరు వ్యక్తులు వాణిజ్య భవనాన్ని నిర్మిస్తున్నారు. సెల్లార్ల నిర్మాణం కోసం దాదాపు 25 అడుగుల మేర మట్టి తవ్వించారు. ఈ పనులను పర్యవేక్షిస్తున్న మేస్త్రీ బిక్షపతి.. పిల్లర్ల కోసం ఏర్పాటు చేసిన ఐరెన్ బెడ్‌లో కాంక్రీట్ పోసేందుకు కూలీల కోసం వెతికారు. ఇందుకోసం పెద్ద అంబర్‌పేట్‌లో నివాసం ఉంటున్న అలకుంట్ల వీరయ్యను సంప్రదించారు.

వీరయ్య తన కుమా...