భారతదేశం, ఏప్రిల్ 18 -- Toshiba layoffs: జపాన్ లోని ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల్లో తోషిబా కార్పొరేషన్ ఒకటి. ఈ సంస్థ ఇప్పుడు 5,000 మంది ఉద్యోగులను తగ్గించాలని (Lay offs) యోచిస్తున్నట్లు నిక్కీ నివేదిక తెలిపింది. ఇది దేశంలోనే అతిపెద్ద లే ఆఫ్ ప్రక్రియ అని భావిస్తున్నారు. సాధారణంగా, జపాన్ లో కంపెనీలు లే ఆఫ్స్ కు వ్యతిరేకం. అక్కడ ఉద్యోగుల కొరత అధికం. కానీ, మారిన పరిస్థితుల్లో అక్కడి కంపెనీలు కూడా లే ఆఫ్స్ బాట పడుతున్నాయి.

టోక్యోకు చెందిన ఈ సంస్థ నాన్ కోర్ వ్యాపారాలను తగ్గించడం ద్వారా తన కార్యకలాపాలను క్రమబద్ధీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫలితంగా తోషిబాకు సుమారు 100 బిలియన్ డాలర్లు (రూ.5,400 కోట్లు) ఖర్చవుతుందని అంచనా వేసింది. జపాన్ లో కార్మిక చట్టాలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. కార్మికుల పరిరక్షణకు, ఉద్యోగ భద్రతకు అవి పెద్ద పీట వేస్తాయి. అయిత...