Hyderabad, మే 18 -- Heroine Laya About Director Harassment: బ్యూటిఫుల్ హీరోయిన్ లయకు అప్పట్లో ఎంత క్రేజ్ ఉండేదో తెలిసిందే. స్వయంవరం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ హీరోయిన్ అనతి కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎక్కువగా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు విపరీతంగా నచ్చేసింది ఈ భామ. అంతేకాకుండా యూత్‌లో కూడా లయకు సూపర్ క్రేజ్ ఉండేది.

స్వయంవరం సినిమా తర్వాత మనోహరం, ప్రేమించు, మిస్సమ్మ, బాలకృష్ణ విజయేంద్ర వర్మ, టాటా బిర్లా మధ్యలో లైలా వంటి ఇతర సినిమాలతో ప్రేక్షకుల అలరించింది. ఎలాంటి పాత్రలో అయిన ఇమిడిపోయి యాక్ట్ చేసే లయకు అభిమానులు భారీగానే ఉండేవారు. లయ చివరిగా బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం సినిమాలో అమ్మవారి పాత్రలో కనిపించింది. అనంతరం సినిమాలు చేయలేదు.

లయ సినీ ఇండస్ట్రీకి దూరమై సుమారుగా 18 సంవత్సరాలు అవుతోంది. సినిమాల తర్వాత అమెరికాలో సెటిల్ అయింద...