భారతదేశం, ఏప్రిల్ 2 -- Law College: కేంద్ర కార్మిక ఉపాధి క్రీడా వ్యవహారాల శాఖ మంత్రి మన్సూక్ మాండవీయతో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ భేటీ అయ్యారు. కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో లా కళాశాల మంజూరు చేయడంతో పాటు అంబేద్కర్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేయాలని వినతి పత్రాలు సమర్పించారు.

కరీంనగర్ లోని శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో లా కాలేజీ (న్యాయ కళాశాల) అనుమతి ఇవ్వాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ ను కోరారు.

శాతవాహన వర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఉమేశ్ కుమార్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ సునీల్ రావులతో కలిసి బండి సంజయ్ ఢిల్లీలో కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు.

పార్లమెంట్ లో అరగంటకుపైగా కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. శాతవాహన వర...