భారతదేశం, ఫిబ్రవరి 3 -- మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి 2023 నవంబర్‌లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత లావణ్య సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్నారు. మెగా ఇంట్లో కోడలిగా అడుగుపెట్టాక నటనకు కాస్త విరామం ఇచ్చారు. పెళ్లి తర్వాత తొలి చిత్రంగా 'సతీ లీలావతి'కి ఆమె ఓకే చెప్పారు. ఇప్పటికే ఈ చిత్రంపై అనౌన్స్‌మెంట్ వచ్చింది. అయితే, నేడు (ఫిబ్రవరి 3) లాంఛంగా ఈ మూవీ లాంచ్ అయింది. షూటింగ్ కూడా మొదలైంది.

సతీ లీలావతి సినిమా పూజా కార్యక్రమాలతో నేడు మొదలైంది. హైదరాబాద్‍లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ కార్యక్రమం జరిగింది. వరుణ్ తేజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సతీ లీలావతి చిత్రంలో లావణ్య త్రిపాఠి, మలయాళ నటుడు దేవ్ మోహన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కెమెరా స్విచ్ ఆన్ చేశారు వరుణ్ తేజ్. ముహూర్త సన్నివేశానికి నిర్మాత హరీశ్ పెద్ది క్లాప...