భారతదేశం, జనవరి 28 -- Lavanya Tripathi About Niharika Konidela Dowry: టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్, మెగా కొత్త కోడలు లావణ్య త్రిపాఠి ఈ మధ్య కాలంలో ఓటీటీ సిరీసులు ఎక్కువగా చేస్తోంది. ఇంతకుముందు పులి మేక అనే వెబ్ సిరీసులో పోలీస్ ఆఫీసర్‌గా ఆకట్టుకున్న లావణ్య త్రిపాఠి ఇప్పుడు మిస్ పర్ఫెక్ట్‌గా రాబోతుంది. రొమాంటిక్ కామెడీ జోనర్‌లో లావణ్య త్రిపాఠి, బిగ్ బాస్ 4 సీజన్ టైటిల్ విన్నర్ అభిజీత్ దుద్దాల హీరోహీరోయిన్లుగా నటిస్తున్న వెబ్ సిరీస్ మిస్ పర్ఫెక్ట్.

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ ఈ మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్‌ను నిర్మించారు. విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వం వహించారు. ఇందులో లావణ్య త్రిపాఠి, అభిజీత్‌తోపాటు యూట్యూబ్ ఫేమ్ అభిజ్ఞ ఉతలూరు, హర్షవర్దన్, ఝాన్సీ, హర్ష్ రోషన్, మహేశ్ విట్టా, సతీష్ సారిపల్లి తదితరులు పలు ముఖ్య పాత్రలు పోషించా...