భారతదేశం, ఏప్రిల్ 2 -- లావా తన నూతన బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్‌కు లావా బోల్డ్ 5జీ అని పేరు పెట్టారు. లావా బోల్డ్ 5జీ ఫోన్‌లో కంపెనీ నుంచి ఎన్నో గొప్ప ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 5జీ నెట్‌వర్క్ సపోర్ట్ చేస్తుంది. మీరు వేగవంతమైన ఇంటర్నెట్ అందుకోవచ్చు. మల్టీ టాస్కింగ్, గేమింగ్‌కు అనువైన శక్తివంతమైన ప్రాసెసర్ ఇందులో ఉంది. పెద్ద బ్యాటరీని కలిగి ఉంది. అలాగే ఫోన్ డిజైన్ కూడా కొత్తగా ఉంటుంది.

ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో లావా బడ్జెట్ ఫోన్ వచ్చింది. రూ.10,499 ప్రత్యేక ధరతో ఏప్రిల్ 8 నుంచి ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. 4 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర ఇది. ఈ ఫోన్ 6 జీబీ ర్యామ్, 8 జీబీ ర్యామ్ వేరియంట్లలో రానుంది. ఈ ఫోన్ అన్ని వేరియంట్ల ధరను ఇంకా వెల్లడించలేదు.

లావా బోల్డ్ 5జీలో 6.67 అంగుళాల 3డీ కర్వ్ డ్ అమోఎల్ఈడ...