Hyderabad, ఫిబ్రవరి 18 -- జీవితంలో తోడు అనేది ప్రతి ఒక్కరికీ అవసరం.అయితే ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి అంటారు పెద్దలు.కానీ కుటుంబ పరిస్థితుల కారణంగా లేదంటే ఆర్థిక సమస్యల వల్ల కొందరికి వివాహం కాస్త ఆలస్యం కావొచ్చు. మరికొందరు మొదట్లో పెళ్లి వద్దనుకుని కాస్త లేటుగా రియలైజ్ అవుతుంటారు. అలా లేటు వయసులో తోడు కోసం వెదుకుతుండొచ్చు.

ఇలా లేటు వయసులో అయినా పెళ్లి చేసుకోవాలి అనుకోవడం మంచిదే. ఈ నిర్ణయం సరైనదే అయి ఉండొచ్చు కానీ, ఇలా వయసు పైబడ్డాక అంటే దాదాపు నలభై ఏళ్లు దాటాక కొత్త వ్యక్తిని అంటే భాగస్వామిని జీవితంలోకి ఆహ్వానించడం వల్ల కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కోగలమని నమ్మినప్పుడే దాని వల్ల కలిగే ప్రయోజనాలు కూడా సొంతమవుతాయి. జీవితం ప్రశాంతంగా ఉంటుంది. వయసు పైబడ్డాక వివాహం చేసుకోవడం వల్ల ఎదురయ్యే సమస్యలు ఏంటో వాటిని ఎలా ఎదుర్...