Hyderabad, జనవరి 5 -- టెక్నాలజీ ప్రతి ఒక్కరి జీవితాన్ని సులభతరం చేసింది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ పని చేయడానికి మొబైల్స్, ల్యాప్‌టాప్‌లను ఉపయోగిస్తున్నారు. వీటిని వాడటం సులభంగా, సౌకర్యంగా అనిపించినప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్య సమస్యలు కలిగే ప్రమాదముంది. వీటిని సరిగ్గా ఉపయోగించడం చాలా ముఖ్యం. ఇంట్లో పనిచేసే కొంతమంది తరచుగా మంచం లేదా సోఫాలో కూర్చున్నప్పుడు ల్యాప్టాప్లను ఉపయోగిస్తారు. అటువంటి పరిస్థితిలో వారు ల్యాప్‌టాప్‌ను కాళ్ల మీద పెట్టుకుని పని చేస్తుంటారు. ఇలా చేయడం చాలా ప్రమాదకరమని చెబుతున్నారు నిపుణులు. ఎందుకో తెలుసుకుందాం రండి..

ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని కూర్చోవడం సౌకర్యంగా అనిపించినప్పటికీ తల దించుకుని పనిచేయడం లేదా సన్నగా కూర్చోవడం, చెడు పోస్టర్‌కు దారితీయవచ్చు. వెన్నుముక, కాళ్లపై ఒత్తిడిని పెంచుతుంది. ఈ చెడు...