భారతదేశం, జనవరి 30 -- Lands Regularization:ఆంధ్రప్రదేశ్‌లో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణకు విధివిధానాలు ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. ఇప్పటికే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆక్రమిత భూముల్లో నివాసాలు ఏర్పరచుకున్న వాటిని క్రమబద్దీకరిస్తారు. ఈ మేరకు రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు.

ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం 2025 పేరిట ఆక్రమించుకున్న భూముల క్రమబద్ధీకరణ కు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేశారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి నిబంధనలు ఖరారు చేశారు.

ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణ కు సంబంధించి గతంలో జారీ చేసిన ఉత్తర్వులన్నిటిని రద్దు చేసి తాజాగా జీవో నెంబర్ 30 ప్రభుత్వం జారీ చేసింది. 2019 అక్టోబర్ 15 తేదీని కటాఫ్‌ తేదీగా నిర్ణయించారు. 2019 అక్...