భారతదేశం, ఏప్రిల్ 1 -- Land Pattas To Poor : మంగళగిరి నియోజకవర్గంలో....లోకేష్ హామీ ఇస్తే నెరవేరినట్టే అని స్థానికులు అంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం చేస్తూ తనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారికి శాశ్వత హక్కు కల్పిస్తూ పట్టాలు అందజేస్తానని హామీ ఇచ్చారు. మంగళగిరి పేద ప్రజల దశాబ్దాల కల నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. మంగళగిరిలో 91,413 ఓట్ల భారీ మెజారిటీతో నారా లోకేష్ గెలిచారు. గెలిచిన మొదటి రోజు నుంచే హామీలపై దృష్టి పెట్టిన ఆయన...ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నారు.

ఎన్నికల ముందు లోకేష్ ఇచ్చిన హామీల్లో ప్రధానమైంది ఇళ్ల పట్టాల సమస్య. ఎన్నో ఏళ్లుగా పేద ప్రజలు ప్రభుత్వ భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకొని నివసిస్తున్నారు. వారంతా తాము నివసిస్తున్న భూమిని, రెక్కల కష్...