భారతదేశం, ఫిబ్రవరి 12 -- మాస్ కా దాస్ విశ్వక్‍సేన్ హీరోగా నటించిన లైలా చిత్రం రిలీజ్‍కు రెడీ అవుతోంది. ఈ మూవీలో విశ్వక్ లేడీ గెటప్‍లో కూడా కనిపించనున్నారు. వాలెంటైన్స్ డే రోజున ఫిబ్రవరి 14న ఈ సినిమా విడుదల కానుంది. బోల్డ్ డైలాగ్‍లతో ఇటీవల వచ్చిన ట్రైలర్ వైరల్ అయింది. ఇటీవల ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో పృథ్వి చేసిన కామెంట్లు పెద్ద రచ్చగా మారాయి. మొత్తంగా ఈ చిత్రంపై క్రేజ్ బాగానే కనిపిస్తోంది. తాజాగా లైలా సినిమా రన్‍టైమ్ వివరాలు బయటికి వచ్చాయి.

లైలా చిత్రం 136 నిమిషాల (రెండు గంటల 16 నిమిషాలు) రన్‍టైమ్‍తో వస్తోంది. సాధారణం కంటే కాస్త తక్కువ నిడివితోనే రానుంది. రొమాంటిక్ కామెడీ మూవీ కావడంతో ఈ క్రిస్పీ రన్‍టైమ్ సరిగ్గా సూటయ్యేలా కనిపిస్తోంది.

సెన్సార్ బోర్డు లైలా మూవీకి ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. అంటే 18 సంవత్సరాల లోపు వారు ఈ చిత్రాన్ని థియేటర్...