భారతదేశం, మార్చి 5 -- మాస్ కా దాస్ విశ్వక్‍సేన్ హీరోగా నటించిన లైలా చిత్రం చాలా బజ్ తెచ్చుకుంది. విశ్వక్ లేడీ గెటప్‍లోనూ కనిపించడం, ట్రైలర్‌ బోల్డ్‌గా ఉండటంతో క్రేజ్ వచ్చింది. ప్రమోషన్లను కూడా మూవీ టీమ్ బాగానే చేసింది. అయితే, వాలెంటైన్స్ డే రోజు ఫిబ్రవరి 14న రిలీజైన లైలాకు పూర్తిగా నెగెటివ్ టాక్ వచ్చింది. క్రింజ్ కామెడీతో అసభ్యంగా ఉందంటూ విమర్శలు వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ చిత్రం బోల్తా కొట్టింది. ఇప్పుడు ఈ లైలా మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది.

లైలా సినిమా మార్చి 7వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుందని సమాచారం వచ్చింది. దీంతో థియేటర్లలో రిలీజైన మూడు వారాల్లోనే లైలా సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. థియేటర్లలో నిరాశపరచటంతో ముందుగానే ఓటీటీలోకి అడుగుపెడుతోంది. మరో రెండు రోజుల్లో మార్చి 7న ఆహా ఓటీటీలోకి వచ్చే లైలాకు ఎలాంటి రె...