Hyderabad, ఫిబ్రవరి 17 -- Laila Box Office Collection: టాలీవుడ్ యువ హీరో విశ్వక్ సేన్ నటించిన మూవీ లైలా. ఈ మూవీకి తొలి రోజు తొలి షో నుంచే నెగటివ్ రివ్యూలు వచ్చాయి. దీని ప్రభావం బాక్సాఫీస్ పై పడింది. ఫస్ట్ వీకెండ్ ఈ సినిమాకు కేవలం రూ.3 కోట్ల గ్రాస్ మాత్రమే కావడం గమనార్హం.

విశ్వక్ సేన్ నటించిన లైలా మూవీ అతని కెరీర్లోనే అతిపెద్ద డిజాస్టర్ అయింది. అత్యంత దారుణమైన రివ్యూలతో ఈ సినిమాకు తొలి షో నుంచే బాగా నెగటివ్ పబ్లిసిటీ వచ్చింది. పూర్తిగా వల్గర్ కంటెంట్ తో వచ్చిన సినిమా ఇది అంటూ సగటు ప్రేక్షకుడు కూడా రివ్యూ ఇచ్చాడు. దీంతో లైలా మూవీ తొలి మూడు రోజుల్లో కేవలం రూ.3 కోట్లు మాత్రమే రాబట్టింది. విశ్వక్ సేన్ కెరీర్లోనే అతి తక్కువ వసూళ్లు సాధించిన సినిమా ఇదే. ఈ రూ.3 కోట్ల గ్రాస్ లో షేర్ కేవలం రూ.1.3 కోట్లు మాత్రమే.

లైలా మూవీలో విశ్వక్ సేన్ లేడీ గెటప...