Hyderabad, మార్చి 24 -- గతంలో వివాహం, ప్రేమ వంటి విషయాల్లో పూర్తిగా మగాళ్ల డామినేషన్ కనిపించేది. ప్రేమ కథల్లోనూ, దాంపత్య జీవితాల్లోనూ ఎక్కడ చూసినా భర్త లేదా ప్రియుడు చెప్పిందే నడిచేది. ఇప్పుడు రిలేషన్స్‌లో పద్ధతి మారింది. పురుషుడు గొప్పవాడు అనే ఫీలింగ్ నుంచి ఆడాళ్లు చెప్పిన మాటే నడిచే విధంగా మారిపోయింది.

ఈ రోజుల్లో మహిళలు ఆర్థిక స్వేచ్ఛను పొందుతున్నారు. కెరీర్‌లో కూడా చాలా వరకూ విజయాలు అందుకుంటున్నారు. ఆత్మవిశ్వాసం కూడా పెరగడంతో రిలేషన్‌షిప్‌ను బాధ్యతాయుతంగా నడిపిస్తున్నారు. కొన్ని పురుష సమాజాల అభిప్రాయం ప్రకారం.. మహిళల కంట్రోల్‌లోనే బంధాలు నడుస్తున్నాయని చెబుతున్నారు. మరి, రిలేషన్‌షిప్‌లో స్త్రీ ఆధిపత్యానికి దారితీసిన అంశాలు ఏంటో ఒకసారి చూసేద్దామా..

గతంలో అమ్మాయిలు ఆర్థిక స్థిరత్వం కోసం మగాళ్లపైనే ఆధారపడాల్సి ఉండేది. ఇప్పుడు మహిళలు తమం...