భారతదేశం, మార్చి 27 -- మోహ‌న్‌లాల్ హీరోగా న‌టించిన ఎల్ 2 ఎంపురాన్ మూవీ పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో గురువారం రిలీజైంది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీకి మ‌ల‌యాళ హీరో పృథ్వీరాజ్ సుకుమార‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ ఈ మూవీలో ఓ కీల‌క పాత్ర పోషించాడు. లూసిఫ‌ర్ మూవీకి సీక్వెల్‌గా తెర‌కెక్కిన ఎల్ 2 ఎంపురాన్ ఎలా ఉంది? ఓవ‌ర్‌సీస్ ప్రీమియ‌ర్స్ టాక్ ఏంటంటే?

ఎల్ 2 ఎంపురాన్ మూవీకి పాన్ ఇండియ‌న్ వైడ్‌గా పాజిటివ్ టాక్ ల‌భిస్తోంది. మోహ‌న్‌లాల్ యాక్టింగ్‌, పృథ్వీరాజ్ డైరెక్ష‌న్ అదిరిపోయాయ‌ని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తోన్నారు. విజువ‌ల్‌గా స్ట‌న్నింగ్‌గా ఉంద‌ని, యాక్ష‌న్ సీక్వెన్స్‌లు హాలీవుడ్ స్టాండ‌ర్స్‌లో గూస్‌బంప్స్‌ను క‌లిగిస్తాయ‌ని ట్వీట్స్ చేస్తోన్నారు.

మోహ‌న్‌లాల్ ఎంట్రీ ఇచ్చే సీన్స్‌కు విజువ‌ల్స్ ప‌డ‌టం ఖాయ‌మ‌ని అంటున్నారు. ఇంట‌ర్వెల్ మ...