Hyderabad, మార్చి 28 -- L2 Empuraan OTT Release Platform: మలయాళంలో 2019లో రిలీజ్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సినిమా లూసిఫర్. ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా చేస్తే.. మరో స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను తెలుగులో గాడ్ ఫాదర్‌గా మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేసిన విషయం తెలిసిందే.

అయితే, లూసిఫర్ సీక్వెల్ కోసం ఆడియెన్స్, అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. దాంతో 2019 తర్వాత ఆరేళ్లకు లూసిఫర్ సీక్వెల్‌తో మోహన్ లాల్-పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబో రిపీట్ అయింది. లూసిఫర్‌ను ఒక ట్రయాలజీగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో భాగంగా రెండో సినిమాగా ఎల్2 ఎంపురాన్ సినిమాను చిత్రీకరించారు.

మరోసారి స్టీఫెన్ నెడుంపల్లి పాత్రలో కంప్లీట్ స్టార్ మోహన్ లాల్ నటించగా.. ఎల్2కి కూడా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. అలాగే, ఇంద...