Hyderabad, మార్చి 27 -- L2 Empuraan Day 1 box office: భారీ అంచనాల మధ్య రిలీజైన మలయాళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఎల్2: ఎంపురన్. పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్ లో మోహన్ లాల్ నటించిన ఈ సినిమాకు మిక్స్‌డ్ రివ్యూలు వచ్చినా.. తొలి రోజు బాక్సాఫీస్ కలెక్షన్లు మాత్రం సరికొత్త రికార్డును క్రియేట్ చేశాయి. ఇప్పటి వరకూ ఏ మలయాళం సినిమాకు సాధ్యం కాని రీతిలో తొలి రోజే ఇండియాలోనే రూ.21 కోట్లు వసూలు చేసిందీ మూవీ.

మలయాళం సినిమా అంటే తక్కువ బడ్జెట్.. ఆ స్థాయికి తగిన వసూళ్లు. చాలా దశాబ్దాలుగా ఇదే పరిస్థితి. కానీ ఇప్పుడు అక్కడి నుంచి కూడా కమర్షియల్ సినిమాలు వస్తున్నాయి. ఇవి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూనే ఉన్నాయి. తాజాగా మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఎల్2: ఎంపురన్ మూవీ తొలి రోజే ఇండియాలో రూ.21 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. గతేడాది పృథ్వీరాజే నటించ...